Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను' అంటూ స‌ర‌దాగా ఫొటో పోస్ట్ చేసిన యువీ!

  • రేపు యువ‌రాజ్ సింగ్ పుట్టిన‌రోజు
  • బీచ్‌లో ష‌ర్ట్ లేకుండా దిగిన ఫొటోను పోస్ట్ చేసిన యువీ
  • రేప‌టిలోగా సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటాన‌ని స‌ర‌దా పోస్ట్‌
టీమిండియా ఆట‌గాడు యువ‌రాజ్ సింగ్ రేపు పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఆయ‌న ఈ రోజు త‌న ఫేస్‌బుక్ ఖాతాలో త‌న మిత్రుడు, టీమిండియా ఆట‌గాడు జ‌హీర్ ఖాన్ కోసం స‌ర‌దాగా ఓ పోస్ట్ చేశాడు. బీచ్‌లో తాను ష‌ర్ట్ లేకుండా దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ త‌న పుట్టిన రోజు వేడుక కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాన‌ని, రేప‌టిలోగా అది వ‌చ్చేస్తుంద‌ని స‌ర‌దాగా అన్నాడు. చివ‌రికి ఏమంటావు జ‌హీర్ ఖాన్? అంటూ అడిగాడు. యువీ ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది. మీరూ చూడండి...
Yuvraj Singh
Cricket
six pack

More Telugu News